వైయస్సార్‌సీపీ ఒక మంచి నాయకుడిని కోల్పోయింది

బెస్తపల్లె (పెనగలూరు): మండలంలోని కోమంతరాజపురం పంచాయితీ పరిధిలో బెస్తపల్లె గ్రామంలో వైయస్సార్‌సీపీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. బెస్తపల్లి గ్రామానికి చెందిన కన్న (సుబ్రమణ్యం) ఆకస్మింగా మృతిచెందడం పార్టీకి తీరనిలోటని ఆయన అన్నారు. పార్టీలో చురుగ్గా పాల్గొంటూ పార్టీకి ఎంతో సేవచేశారని అటువంటి మంచి వ్యక్తిని కోల్పోయామన్నారు. కన్నా కుటుంబసభ్యులను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. అంతకముందు కన్నా మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. 

Back to Top