కోరాడ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

కోరాడ, 05 ఏప్రిల్ 2013:

జన కెరటాల నడుమ కృష్ణా తీరంలో మరో ప్రజాప్రస్థానం సాగుతోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 112వ రోజు పాదయాత్ర శుక్రవారం కోరాడ నుంచి ప్రారంభమైంది. జామెస్‌పేట, విన్నకోట, సంఘర్షణపురం, పెనుమిల్లి, సింగారం సెంటర్‌, గురజా, ముదినేపల్లి మీదుగా పాదయాత్ర సాగుతుంది. ముదినేపల్లిలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు.  14.2 కిలో మీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు.

Back to Top