రెండు కుటుంబాలకు కొండేటి పరామర్శ

అంబాజీపేట : స్థానిక మెట్ల కాలనీకి చెందిన రెండు కుటుంబాలను వైయస్సార్‌ సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు బుధవారం పరామర్శించారు. కాదంబరి అన్నపూర్ణ ఇటీవల మృతి చెందడంతో ఆమె భర్త సాయిబాబును కొండేటి పరామర్శించారు. అదే కాలనీకి చెందిన షేక్‌ హుసేన్‌ కుటుంబ సభ్యులను ఆయన పలుకరించారు. ఇరువురి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు మట్టపర్తి పరమేశ్వరావు, యలమంచలి బుచ్చిబాబు, సయ్యద్‌ వలీ, జాకీర్, గిడ్డు రాజేష్, కొత్తూరి బాబు, యు.వి.వి.సత్యనారాయణ, కొండేటి స్టాలిన్‌ తదితరులు ఉన్నారు.

Back to Top