కొండగట్టు ప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాద ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు తిరుగుప్రయాణమయ్యారు. భక్తులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో లోయలోపడిపోయింది ఈ ప్రమాదంలో సుమారు 45 మంది మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
Back to Top