వైయస్‌ జగన్‌ను కలిసిన కొండ దేవర మహిళలు

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కొండ దేవర మహిళలు కలిశారు. తమ కష్టాలను వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. తమకు తల దాచుకునేందుకు సరైన ఇల్లు లేదని, తినడానికి తిండి లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించుకుందామంటే తమకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. పిల్లలను చదివించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా వైయస్‌ జగన్‌ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తానని, పిల్లలను చదివిస్తానని మాట ఇచ్చారు. 
 
Back to Top