నామినేషన్ దాఖలు చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి

హైదరాబాద్: శుక్రవారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయంగా వెనుకబడిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినప్పటికీ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ వీరభద్ర స్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ జగన్ ది ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వమన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్ర స్వామి పేర్లను వైఎస్సార్ సీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Back to Top