సత్య దేవుడ్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ

విజయనగరం మున్సిపాలిటీ: అన్నవరంలో కొలువు దీరిన వీరవెంకటసత్యన్నారయణ స్వామి వారిని ఎమ్మెల్సీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, వెంకటరమణి దంపతులు గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులకు కోలగట్లకు పూర్ణకలశంతో స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నాయకులు బొట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top