ఖాద‌ర్ వ‌లి బాబా ద‌ర్గాను సంద‌ర్శించిన ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్త‌రాంధ్ర జిల్లాల క‌న్వీన‌ర్‌, ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి శనివారం హ‌జ‌ర‌త్ ఖాద‌ర్ వ‌లి బాబా ద‌ర్గాను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ద‌ర్గా క‌మిటీ స‌భ్యులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కొల‌గ‌ట్ల ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించి, ఫాతేహాలు స‌మ‌ర్పించారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుభీక్షంగా ఉండాల‌ని ప్రార్థించిన‌ట్లు కొల‌గ‌ట్ల తెలిపారు. ఆయ‌న వెంట పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.Back to Top