ప్రజల తరపున ప్రశ్నించిన ప్రతిపక్షం గొంతు నొక్కారు

శాసనసభ,మండలి సమావేశాల్లో ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచన చేయకపోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీని సభలో ప్రశ్నించకుండా చేసిన టీడీపీ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలు టీడీపీపై విసిగివేసారి పోయారని కొలగట్ల పేర్కొన్నారు. శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కడం రాష్ట్ర ప్రజల గొంతునొక్కడమేనని అన్నారు. ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి, ఆయన సహచరులు సహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.


To read this article in English: http://goo.gl/4Y3Pe3 
Back to Top