రాజీనామా వార్తలను కొట్టిపారేసిన కోలగట్ల

విజయనగరం: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల విరభద్రస్వామి టీడీపీలో చేరనున్నారంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.  పార్టీ పదవికి రాజీనామా చేయనున్నాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు అసత్య కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీలో చేరే ప్రసక్తేలేదని అన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top