కోడూరు నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

గుడివాడ (కృష్ణా జిల్లా), 6 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 113వ రోజు శనివారం ఉదయం కృష్ణా జిల్లా కోడూరు నుంచి ప్రారంభమైంది. మహానేత రాజన్న తనయకు కృష్ణా జిల్లా ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. కాల్వలపూడి సత్రం, పెదపలపర్రు, చౌటపల్లి, కొట్టమల్లయ్యపాలెం, మల్లయ్యపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్, ముబార‌క్ సెంట‌ర్, ఓ‌ల్డు బైపాస్ రో‌డ్, గు‌డ్‌మన్‌పేట, బస్టాండ్ మీదుగా పాదయాత్ర ‌కొనసాగుతుంది. నెహ్రూచౌక్‌లో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Back to Top