కోడెల అవినీతి కార్యక్రమాలు

స్పీకర్ శాసనసభ్యుల హక్కులు కాలరాస్తున్నారు
కోడెల అధికార దుర్వినియోగం వల్ల..
సొంత నియోజకవర్గంలో తనకు అన్యాయం జరుగుతోంది
కోడెల కుమారుడు, కూతురు అవినీతికి పాల్పడ్డారు
అవినీతి అవాస్తమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధంఃగోపిరెడ్డి

హైదరాబాద్ః స్పీకర్ అధికార దుర్వినియోగం వల్ల .... సొంత నియోజకవర్గంలో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నర్సారావుపేట నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమం స్పీకర్ కనుసన్నల్లోనే కొనసాగుతుందని అన్నారు. శాసనసభ్యుల హక్కులు కాపాడాల్సిన సభాపతి కోడెల ...నియోజకవర్గంలో తన హక్కుల్ని కాలరాస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. నర్సారావుపేటకు సంబంధించిన శాసనసభ్యుడిగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

1999లో స్పీకర్ ఇంట్లో బాంబులు పేలి నలుగురు చనిపోతే అందులో ఒకరు ఇండింపెండెంట్ గా పోటీచేస్తున్న వ్యక్తిని అని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆకేసులకు సంబంధించి కోడెలకు సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చిందని మంత్రులు చెప్పడం అవాస్తవమన్నారు. ఓసారి రికార్డులు చూసుకుంటే వాస్తవాలేంటో బోధపడుతాయన్నారు. అప్పట్లో  ఉన్న బీజేపీ ప్రభుత్వం కోడెల‌ను సీబీఐ ఎంక్వైరీకి అనుమతించలేదన్నారు. ఇదే కోడెల శివప్రసాద రావు...బాధ్యత గల స్పీకర్ స్థానంలో ఉండి ముప్పాళ్ల ఎంపీటీసీల‌ను కిడ్నాప్ చేస్తే విచార‌ణ జ‌రిపించ‌ారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోడెల పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి హాజ‌రుకావ‌డం, ఇతర పార్టీల వారికి పచ్చకండువాలు కప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ల్యాండ్ సర్వే జరగకుండా ఓ రైతుకు సంబంధించి పొలంలో రోడ్డు వేసి శంకుస్థాపన చేశారని..ఇది తప్పని నిలదీసినందుకే తనపై అక్రమంగా కేసులు పెట్టారని గోపిరెడ్డి తెలిపారు. అది  త‌ప్పు అని తెలుసుకొని తిరిగి స్టేష‌న్ బెయిల్‌ ఇచ్చారన్నారు. స్పీక‌ర్  కుమారుడు, కుమార్తె అవినీతికి పాల్పడుతున్నారని గోపిరెడ్డి ఫైరయ్యారు. అవినీతి అవాస్తమని నిరూపిస్తే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమన్నారు. ఓ గ్రామంలో శిలాఫలకంపై కోడెల శివప్రసాదరావు కొడుకు పేరు లిఖించారని ధ్వజమెత్తారు. 


Back to Top