మోసం చేశారు కాబట్టే పోరాటం చేస్తున్నాం

కృష్ణా: చంద్రబాబు సర్కార్‌ పేద ప్రజలను విస్మరించింది కాబట్టే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి దిగిందని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటుందని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై పార్టీ బూత్‌ కమిటీలు, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని హాజరై దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజలను మోసం చేయడానికే ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకం రశీదులు ఇచ్చారని, అదంతా బూటకమన్నారు. హౌసింగ్‌ స్కీం వల్ల 20 సంవత్సరాలు అప్పులు కట్టాల్సిన పరిస్థిని ఉంటుందన్నారు. చంద్రబాబు మోసాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top