బలవంతంగా భూములు లాక్కుంటే...చూస్తూ ఊరుకోం

ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో బలవంతపు భూ సేకరణకు పాల్పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆపార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. ఏపీ రాజధాని రైతులకు మద్ధతుగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ .... 'కొన్ని గ్రామాల్లో రైతులు మా పొలాలు ఇవ్వం అని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సర్కార్  భూ సేకరణకు పాల్పడుతోంది.  రైతుల  భూములు బలవంతంగా లాక్కుంటే ఊరుకునేది లేదని మా నాయకుడు వైఎస్ జగన్ అనేకసార్లు చెప్పారు. అయితే ఈరోజు సీఎం చంద్రబాబు కానీ, మంత్రులు చెప్పే సాకులు చాలా విచిత్రంగా ఉన్నాయి.  రాజధాని కట్టడం వైఎస్ జగన్కు ఇష్టం లేదు. టీడీపీకి మంచి పేరు వస్తుందని జగన్ అడ్డుపడుతున్నాడని మంత్రులు మాట్లాడుతున్నారు.
Back to Top