కిరణ్ సర్కారుకు ఎన్నికల భయం: నల్లపురెడ్డి

కొడవలూరు:

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నా రు. కొడవలూరు నీటిపారుదల శాఖ భవనంలో గురువారం వైఎస్సార్‌సీపీ గ్రామ స్థాయి తాత్కాలిక కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై సీ ఎం రోజుకోమాట మాట్లాడుతున్నారన్నారు. దీ న్ని బట్టి చూస్తేనే ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని అర్థమవుతుందన్నారు. హైకోర్టు తీర్పుతో మూడు నెలల్లోగా ఎన్నికలు ని ర్వహించాల్సి ఉందని తెలిపారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైయస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు.
జగన్ కడిగిన ముత్యం: వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా ప్రజల్లోకి త్వరలోనే వస్తారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కక్ష సాధింపుతోనే ఆయనను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. సీబీఐ ఒక్క ఆరోపణనూ రుజువు చేయలేక పోయిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని సజావుగా అమలు జరపాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. వివిధ సమస్యలపై మహిళలు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన పార్టీ సభ్యత్వ నమోదును ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. కొడవలూరు మండలంలో ఇప్పటికే ఏడు గ్రామాల్లో సభ్యత్వ నమోదు పూర్తయిందన్నారు.

తాజా వీడియోలు

Back to Top