ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు

విశాఖ జడ్పీ సమావేశంలో టీడీపీ నేతల దౌర్జన్యం
బాక్సైట్ వ్యతిరేక తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్సీపీ
మైక్ లాక్కున్న పచ్చనేతలు..సభ నుంచి వాకౌట్

విశాఖపట్నం: టీడీపీ సర్కార్ ప్రతిపక్షంపై కక్షసాధింపుకు పాల్పడుతోంది. ఎక్కడ కూడా ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అడ్డుపడుతోంది. తమ అవినీతి, అక్రమాల గుట్టురట్టయితే ప్రజలు తరిమికొడతారని తెలుగుతమ్ముళ్ల భయపడుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్సార్సీపీని అణిచే కుట్రలో భాగంగా పచ్చనేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలు జడ్పీ సమావేశం వరకు ప్రజల సమస్యలపై ప్రతిపక్షానికి ఎక్కడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. నియంత పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన జడ్పీసమావేశంలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. 

సర్వేశ్వర్ రావు...
బాక్సైట్ అంశంపై జడ్పీ సమావేశం దద్దరిల్లింది. సమావేశం ప్రారంభం కాగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ... బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు అడ్డుతగిలారు. ప్రతిపక్ష నేతలకు మైకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఎమ్మెల్యే కిడారికి మైక్ ఇవ్వడానికి వీల్లేదంటూ దౌర్జన్యానికి దిగారు. ఆయన మాట్లాడుతుంగా చేతిలో ఉన్న మైక్‌ను లాక్కున్నారు. దీంతో కిడారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.  ఏపీ అసెంబ్లీలో మైకులు కట్ చేశారు. ఇప్పుడు జడ్పీ సమావేశంలో కూడా మైకులు ఇవ్వకుండా  ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంటూ  కిడారి సర్వేశ్వరరావు మండిపడ్డారు. 2015లో విశాఖ చరిత్రలో ఇదొక చీకటి దినంగా అభివర్ణించారు. 

గిడ్డి ఈశ్వరి...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నట్లు అనిపించడం లేదని, నియంత పాలనలో ఉన్నట్లు అనిపిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాసమస్యలపై చర్చకు పట్టుబడితే ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు . అధికారం ఉందని ఏదైనా చేయొచ్చనుకుంటే గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే టీడీపీకి పడుతుందని ఈశ్వరి హెచ్చరించారు. బాక్సైట్ జీవో రద్దు చేయకుండా చంద్రబాబు నిద్ర పోతున్నట్లు నటిస్తున్నారని ఈశ్వరి ఫైరయ్యారు. గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతుంటే అవన్నీ పట్టించుకోకుండా.... చంద్రబాబు బాక్సైట్ ను కొల్లగొట్టి లక్షల కోట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ కోసం ఏవేదికనైనా ఉపయోగించుకుంటామని,  ప్రాణాలు అడ్డుపెట్టైనా  తవ్వకాలను అడ్డుకుంటామని ఈశ్వరి తేల్చిచెప్పారు.  

Back to Top