ఇడుపులపాయలో ఖమ్మం జిల్లా నేతలు

ఇడుపులపాయః
ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు
వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయలో అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిశారు.
ఈసందర్భంగా వైఎస్ జగన్ తో పార్టీ నేతలు ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంపై
చర్చించారు. ఖమ్మం జిల్లాలో పార్టీని నిజాయితీగా ముందుకు తీసుకెళుతున్నారని
వైఎస్ జగన్ వారిని ప్రశంసించారు.  రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా
వైఎస్సార్సీపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఎమ్మెల్సీ
స్థానాన్ని గెలుచుకునేవిధంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైఎస్ జగన్ నేతలకు
సూచించారు.  
Back to Top