వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మవరం ఎమ్మెల్యే

హైదరాబాద్ 26 ఆగస్టు 2013:

అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం సాయంత్రం ఆయన లోటస్ పాండ్‌లో నివాసంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మసమక్షంలో పార్టీలో చేరారు.  రాష్ట్రవిభజన వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం కేతిరెడ్డి వహిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఆగ్రహం ఉన్న కేతిరెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు. ఆయనకు విజయమ్మ కండువా కప్పి పార్టీ లోకి  సాదరంగా ఆహ్వానించారు.
 సమైక్యాంధ్రకు మద్దతుగానూ, జైలులో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారి దీక్షకు మద్దతుగా తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. సమైక్య పార్టీలవైపే ప్రజలు మొగ్గుచూపూతారని తెలిపారు.  అన్ని అంశాలలో ఆంధ్ర ప్రజలకు జరిగే అన్యాయాలపై శ్రీ జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారని ప్రశంసించారు. మిగిలిన పార్టీలు ద్వంద్వ నీతితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలుగు జాతి విచ్ఛిన్నం కాకుండా ఉండాలనే సదుద్దేశంతో పోరాడుతున్న శ్రీ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా ఉన్నారు.

Back to Top