కేంద్రానికి లేఖ అంటూ బాబు హడావుడి

విజయవాడ: కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. రాష్ట్ర ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ప్రజలు తమ సమస్యలపై పోరాటం చేస్తారేమోనని భ‌య‌ప‌డి నిధులపై కేంద్రానికి లేఖ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారే త‌ప్ప కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల‌న్న చిత్త‌శుద్ధి టీడీపీలో ఏ ఒక్క‌రికి క‌న‌బ‌డ‌డం లేద‌ని జోగి రమేష్ మండిపడ్డారు.

Back to Top