కెఇ వ్యాఖ్యలపై మండిపడిన గట్టు

హైదరాబాద్, 29 మార్చి 2013:

తెలుగుదేశం పార్టీ నేత కె.ఇ. కృష్ణమూర్తి వ్యాఖ్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. టీడీపీ నేతలు తీవ్రవత్తిడికి లోనై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతాప సభలా మార్చారని ఎద్దేవాచేశారు. చంద్రబాబుకు తప్పుడు సలహాలు ఇచ్చి, పార్టీని ఈ దుస్థితికి తీసుకువచ్చారని, ముందు మీ పార్టీలో సమీక్ష చేసుకోండని సలహా ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబాన్ని తరచూ విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికే మీ పార్టీని ప్రజలు చెత్తబుట్టలో వేసిన విషయాన్ని మరచిపోవద్దని సూచించారు.

Back to Top