కేసీఆర్ ఏక‌ప‌క్ష పోకడలు మానుకో

  • టీఆర్ఎస్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది
  • ఏకపక్ష నిర్ణయాలు మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు
  • తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్‌

హైద‌రాబాద్:  టీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్ అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఈనెల 2న నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి వైయస్సార్సీపీని ఆహ్వానించకపోవడాన్ని తప్పుబట్టారు. ఎన్నిక‌ల క‌మీష‌న్ నుంచి గుర్తింపు పొందిన అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని ప్రభుత్వం చేసిన  ప్ర‌కట‌నలు... పత్రిక‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాయన్నారు.  హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో శివకుమార్ మాట్లాడారు.

మ‌రిన్నివిష‌యాలు ఆయ‌న మాట‌ల్లోనే....
* గ‌త కొంతకాలంగా వైయ‌స్సార్‌సీపీ, ఇత‌ర పార్టీలు ముఖ్యమంత్రి అనుమతి కోరినా.... కేసీఆర్ స్పందించ లేదు
* టీఆర్ఎస్ ఏకప‌క్ష నిర్ణ‌యాల వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని సీఎం కార్యాల‌యానికి ఉత్త‌రం, ఫ్యాక్స్ ద్వారా తెలియ‌జేశాము.
* ముఖ్య‌మంత్రికి ఇవ్వాల్సిన ఫిర్యాదుల‌న్నీ కూడా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఇదీ బంగారు తెలంగాణ‌లో జరుగుతున్న ప‌రిపాల‌న‌.
* ఒక‌వైపు కేసీఆర్ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో అఖిల‌ప‌క్ష స‌మావేశానికి అన్ని పార్టీల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని ప్ర‌చురించాయి
* సీఎంఓ కార్యాల‌యం నుంచి విడుద‌లైన పత్రిక ప్ర‌క‌ట‌న‌లో మాత్రం వైయ‌స్సార్‌సీపీని ఆహ్వానించ‌క‌పోవ‌డం దారుణం
* ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచిన వామపక్ష పార్టీలకు  ఆహ్వానాలు పంపారు. 2014లో వైయ‌స్సార్‌సీపీ గుర్తుపై ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచితే ఆహ్వానం పంపరా..?
* ఎన్నిక‌ల క‌మీష‌న్ నుంచి గుర్తింపు పొందిన అన్ని రాజ‌కీయ పార్టీల‌ను అఖిల‌స‌క్ష స‌మావేశాల‌కు ఆహ్వానించాలి
* కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేప‌ట్టిన మొద‌టి అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని సైతం తూతూ మంత్రంగా నిర్వ‌హించారు. 
* జీవో నంబ‌ర్ 58,59ను నాడు వైయ‌స్సార్ సీపీ త‌ర‌ఫున నేనే స్వ‌యంగా రిప్రజెంట్ చేశాను. 
* జీవో నంబ‌ర్ 58, 59పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు అనుగుణంగా కొన్ని సూచ‌న‌లు సైతం అందించిన ఘ‌న‌త వైయ‌స్సార్‌సీపీది
* మిగ‌తా రాజ‌కీయ పార్టీలు సైతం వైయ‌స్సార్‌సీపీ చేసిన సూచ‌న‌ల‌కే మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో వాటిని అమ‌లు చేశారు
* స్వాతంత్ర్య దినోత్స‌వ కార్యక్ర‌మానికి సంబంధించిన వాటికి కూడా వైయ‌స్సార్సీపీకి ఆహ్వానం అందించ‌లేదు
* పార్టీ ఫిరాయింపులకు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై సుప్రీం కోర్టు తెలంగాణ ప్ర‌భుత్వానికి మొట్టికాయ‌ల‌ను వేసింది... ఇప్ప‌టికైనా తెలంగాణ ప్ర‌భుత్వం మెల్కోవాలి
* వైయ‌స్సార్‌సీపీ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఎల్లప్పుడు పోరాటాలు చేస్తుందని శివకుమార్ స్పష్టం చేశారు. 
Back to Top