కేసీఆర్ పాలనంతా అవినీతిమయం

-12 శాతం మైనారిటీ రిజర్వేషన్ హామీ గాలికొదిలేశారు
- ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడిన ఘనత వైయస్సార్ దే
- త్వరలో తెలంగాణ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ నిర్వహిస్తాం
- తెలంగాణ వైయస్సార్సీపీ నేతలు మతీన్, రెహమాన్

హైద‌రాబాద్‌:  పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌న్న కేసీఆర్...ఇచ్చిన హామీని గాలికి వ‌దిలేశార‌ని తెలంగాణ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌తీన్ అన్నారు. తెలంగాణ వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర మైనార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. తెలంగాణ‌లోని 10 జిల్లాల అధ్య‌క్ష‌ులు, కార్య‌ద‌ర్శులు, ప‌లువురు నేత‌లు హ‌జ‌ర‌య్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు.  

మ‌రిన్ని విష‌యాలు మ‌తీన్ మాట‌ల్లోనే....
* ఎన్నిక‌ల్లో క‌ల్ల‌బొల్లి హామీలిచ్చిన కేసీఆర్ స‌ర్కారు వాటిని ఇంత‌వ‌ర‌కు నేర‌వెర్చ‌లేదు
* మైనార్టీ రిజ‌ర్వేష‌న్‌పై వేసిన క‌మిటీ నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హరిస్తుంది.
* 12శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తానంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన కేసీఆర్‌ను ప‌ది జిల్లాల్లోని ముస్లింలు అంద‌రూ నిల‌దీయాలి.
* ప్ర‌తి జిల్లాలో కేసీఆర్ చేస్తున్న అక్ర‌మ‌, అవినీతి పాల‌న‌పై పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌ల్పిస్తాం.
* దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముస్లిల అభ్యున్న‌తికి ఎంతో కృషి చేశారు.
* భార‌త‌దేశంలోని ఏ ముఖ్య‌మంత్రి ముస్లింల అభ్యున్న‌తికి పాటు ప‌డ‌లేద‌ు.. కేవ‌లం ఒక్క వైయ‌స్సార్ మాత్ర‌మే పాటుప‌డ్డారు
* వైయ‌స్సార్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పే అవ‌కాశం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ల‌భించింది.
* త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో వైయ‌స్సార్‌సీపీ భారీ బ‌హిరంగ స‌భ‌ ఉంటుంది
* ప్ర‌తి జిల్లా నుంచి సుమారు 2 నుంచి 3వేల మంది మైనార్టీలు హాజరుకానున్నారు.

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌లో ముస్లిం సోద‌రులు హాజ‌రై విజ‌య‌వంతం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని వైయ‌స్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అబ్దుల్ ర‌హ‌మాన్‌ పిలుపునిచ్చారు.  ఈసందర్భంగా మాట్లాడుతూ ఏమన్నారంటే...

*  కేసీఆర్ స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌థ‌కాల‌ను తుంగ‌లో తొక్కుతూ... ప్ర‌జ‌ల‌ను మభ్యపెడుతున్నాడు. 
* ముస్లింల‌కు 4 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన ఘ‌న‌త ఒక్క వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి మాత్ర‌మే ద‌క్కింది. 
* షాదీ ముబార‌క్ ప‌థ‌కంలో అన్ని అవ‌క‌త‌వ‌క‌లే...
* రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కీల‌క‌పాత్ర పోషిస్తుంది
* వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని కూలాలు, మ‌తాల‌కతీతంగా పనిచేస్తుంది
* ఆంధ్ర‌లో చంద్ర‌బాబుకు ఏ ముస్లిం సోద‌రుడు ఓటు వేయ‌లేదు కాబ‌ట్టే త‌మ పార్టీకి సంబంధించిన ముస్లిం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 

Back to Top