వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్త మృతి–పరామర్శించిన కావటి

రుద్రవరం (అచ్చంపేట)వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ కార్యకర్త మేకా వెంకటరెడ్డి (80) మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రవరంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటరెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్సపొందుతున్నాడు మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో తుది శ్వాస వదిలారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానిగా, వైస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన వెంకటరెడ్డి గ్రామంలో పార్టీ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. ఆయన భౌతిక కాయాన్ని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగ మనోహరనాయుడు సందర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలియచేశారు. పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. వెంకటరెడ్డి పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసేవారని, ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేనిదని తెలిపారు. మృతునికి భార్య సాంబులు, ముగ్గురు సంతానం ఉన్నారు. కావటి వెంట మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ సీహెచ్‌ ఎస్సార్కే సాయిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అనుమెల సాంబిరెడ్డి, జిల్లా బీసీ నాయకులు మేకల హనుమంతరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండా భద్రారెడ్డి, క్రోసూరు ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, గోగిరెడ్డి, బ్రహ్మారెడ్డి, తలతల వెంకటశివారెడ్డి ఉన్నారు.

Back to Top