"కావలి బంద్‌"

కావలి: సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీక్ష రెండోరోజు శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో దీక్షాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిఘటించారు. భారీగా మోహరించిన పోలీసులు కార్యకర్తలను తోసేసి వైద్యుల సాయంతో ఎమ్మెల్యేని తీసుకెళ్లారు. ఆస్పత్రిలో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్షను భగ్నం చేశారు. ఎమ్మెల్యే దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకత్తలు బంద్ నిర్వహించారు.

పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేయడాన్నిఖండించిన పలువురు నాయకులు బంద్ లో పాల్గొన్నారు. బంద్ ప్రశాంతంగా కొనసాగోతోంది.
Back to Top