కౌలు రైతులకూ పరిహారమివ్వాలి: విజయమ్మ

భీమవరం:

రైతులతో పాటు కౌలు రైతులకు కూడా పరిహారమివ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాధిత రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. మంగళవారం ఉదయం ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రాంతాల పరిశీలనను కొనసాగించారు. కొత్తపేటలో నీట మునిగిన పొలాలను పరిశీలించి ఆమె రైతులతో మాట్లాడారు. ఎకరానికి పదివేల రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, పేరుపాలెం పరిసర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. పేరుపాలెం పొలాల్లో మూడడడుగుల మేర వరద నీరు నిలిచిపోయి ఉంది. వరద సహాయక కార్యక్రమాలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విజయమ్మ ధ్వజమెత్తారు. ఆమె వెంట ఎమ్మెల్యే రాజేష్, పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, తదితరులున్నారు.

Back to Top