జనార్ధన్ రెడ్డి ఓ చేతగాని దద్దమ్మ

క‌ర్నూలుః  బ‌న‌గాన‌ప‌ల్లె శాస‌న‌స‌భ్యుడి తీరు పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా మారింద‌ని స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు . తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతుంటే టీడీపీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి చోద్యం చూస్తున్నాడని ఫైరయ్యారు.   2019 ఎన్నిక‌ల్లో జనార్ధన్ ను ప్ర‌జ‌లు త‌రిమిత‌రిమి కొడ‌తార‌న్నారు. ప్ర‌జ‌ల దాహార్తిని  దృష్టిలో ఉంచుకొని త‌న సొంత డ‌బ్బుల‌తో వాట‌ర్‌ప్లాంట్ మ‌ర‌మ్మ‌తులు చేయిస్తున్న‌ట్లు రామిరెడ్డి తెలిపారు. 

జనార్థన్ రెడ్డి చేత‌గానీ త‌నం వ‌ల్లే వాట‌ర్‌ప్లాంట్‌లు మ‌ర‌మ్మ‌తులకు నోచుకోవ‌డం లేద‌ని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . ఆరు మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ఉంటే అందులో ఒక్క‌టి కూడా ప‌ని చేయ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌త్యేక అధికారులు సైతం అధికార పార్టీ నాయ‌కుల‌కు తొత్తులుగా మారారని విమ‌ర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌పై ఎందుకింత కక్షసాధిస్తున్నారని ధ్వజమెత్తారు. చేత‌కానీ ద‌ద్ద‌మ్మ అని ఒప్పుకొని జనా ర్థన్ రెడ్డి ప‌ద‌వి నుంచి వైదొలగాలని కాటసాని డిమాండ్ చేశారు. 
Back to Top