బాబు ప్రజా ద్రోహి

* మోసపూరిత వాగ్ధానాలతో అందలం
* వచ్చే ఎన్నికల్లో బాబుకు గుణపాఠం తప్పదు
* మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి


కోవెలకుంట్ల (క‌ర్నూలు): ఎన్నిక‌ల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన చంద్ర‌బాబు ప్ర‌జా ద్రోహి అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి అన్నారు. కోవెల‌కుంట్ల మండ‌లంలోని బిజ‌న‌వేముల గ్రామంలో బుధ‌వారం చౌడేశ్వ‌రీదేవి జ్యోతుల మ‌హోత్స‌వంలో పాల్గొన్న కాట‌సాని ఆ కార్య‌క్ర‌మం అనంత‌రం ఎంపీటీసీ భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి స్వగృహంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి 600 హామీలతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు మూడున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. నీరు– చెట్టు పథకం పేరుతో టీడీపీ నాయకులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు 21 మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను  సంతలో పశువుల్లా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నార‌ని మండిప‌డ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ 108, 104, తదితర బృహత్తర పథకాలు ప్రవేశపెడితే ఆ పథకాలు ప్రజలకు చేరకుండా తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నార‌ని హెచ్చ‌రించారు. 

తాజా ఫోటోలు

Back to Top