రైతు కుటుంబానికి పరామర్శ

కోవెలకుంట్ల : వెలగటూరుకు చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి కుటుంబాన్ని వైయస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. అప్పుల భాదలు తాళలేక మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం కాటసాని గ్రామానికి చేరుకుని మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, సర్పంచ్‌ ఎల్‌వీ సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

భీంరెడ్డికి నివాళి:
బిజనవేములలో వైయస్సార్‌సీపీ నేత దివంగత భీంరెడ్డి నాగేశ్వరరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాటసాని నివాళులర్పించారు. ఎంపీటీసీ భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, చిన్నకొప్పెర్ల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top