రామ్మోహన్‌రెడ్డిని పరామర్శించిన కాటసాని

బనగానపల్లె రూరల్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డిని పార్టీ సీనియర్‌ నేత కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. రామ్మోహన్‌రెడ్డి వాహనం సోమవారం ప్రమాదవశాత్తు బోల్తాపడిన విషయాన్ని తెలుసుకున్న కాటసాని రామిరెడ్డి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డితో పాటు డ్రైవర్‌ హుస్సేన్‌భాషను పరామర్శించారు. ప్రమాదం జరిగేందుకు గల కారణాలను సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డిని  అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న పలురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి రామ్మోహన్‌రెడ్డిని పరామర్శించారు.

Back to Top