ఈ నెల 16న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి కాసు మ‌హేశ్ రెడ్డిహైద‌రాబాద్‌: మాజీ ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి మ‌న‌వ‌డు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు  కాసు మ‌హేశ్ రెడ్డి ఈ నెల 16వ తేదీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఈ సంద‌ర్భంగా కాసు మ‌హేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నామ‌ని ఆ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరుతున్న‌ట్లు చెప్పారు. కాగా మ‌హేశ్‌రెడ్డి చేరిక‌తో గుంటూరు జిల్లాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో మహేశ్‌రెడ్డితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన నాయ‌కులు ఉన్నారు. 
Back to Top