వైయస్సార్సీపీలో చేరిన కాసు మహేష్ రెడ్డి

గుంటూరుఃనరసరావుపేట జన సంద్రమైంది. రెడ్డి కాలేజ్ లో వైయస్సార్సీపీ నిర్వహించిన వైయస్ జగన్ బహిరంగసభకు జనం పోటెత్తారు.  వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకంతా సభా ప్రాంగణం హోరెత్తింది. జై జగన్ నినాదాలతో మార్మోగింది. నరసరావుపేట వేదికగా కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాసు వెంకట క్రిష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. వైయస్ జగన్ మహేష్ రెడ్డికి పార్టీ కండువా కప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.  వైయస్ జగన్ స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి లతో కలిసి చేతులు పైకెత్తినప్పుడు జనం హర్షధ్వానాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
Back to Top