వేడుక‌గా కాసు మ‌హేష్‌రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు

గుర‌జాల‌: గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త కాసు మ‌హేష్‌రెడ్డి 41వ జ‌న్మ‌దిన వేడుక‌లు శ‌నివారం స్థానిక పార్టీ కార్యాల‌యంలో వేడుక‌గా జ‌రిగాయి. మండల కన్వీనర్‌ సిద్దాడపు గాందీ జన్మదిన కేక్‌ను కట్‌చేశారు. గాందీ మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుందని కేవలం పచ్చచొక్క వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌న్నారు. నిజమైన పేద వారికి ప‌థ‌కాలు అందని ద్రాక్ష‌గా మారాయ‌న్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను టీడీపీ వారు భ‌య‌పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పనిసరిగా జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాసు మహేష్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top