సమస్యల పరిష్కారానికి ఎంపీ చర్యలు

దుత్తలూరు: మండలంలోని నందిపాడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై సిబ్బంది తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను నివేదిక రూపంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దృష్టికి తీసికెళ్లారు. పాఠశాలలో ప్రధానంగా నీటి సమస్య ఉందని, తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉందని తెలిపారు.  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. చెప్పిందే తడవుగా తాత్కాలిక చర్యల కింద పాఠశాలకు ట్యాంకర్‌ ద్వారా మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తున్నారు. అలాగే సొంత నిధులతో ఈ వారంలోనే పాఠశాలకు ఆక్వాగార్డు అందిస్తున్నట్లు తెలిపారని పాఠశాల ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌ శైలజ తెలీపారు. మినరల్‌ వాటర్‌ ప్లాంటు, తరగతి గదుల నిర్మాణానికి త్వరితగతిన అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాల సిబ్బంది ఎంపీ రాజమోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలీపారు.

Back to Top