కసాపురంలో వైయస్ఆర్ విగ్రహావిష్కరణ

గుంతకల్లు:

  అనంతపురం జిల్లా కసాపురం చేరుకున్న మహానేత వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వేల సంఖ్యలో ప్రజలు దీనికి హాజరయ్యారు. పూల వర్షం కురిపించారు. అక్కడే ఏర్పాటు చేసిన మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఆదరించిన అనంతవాసులందరికీ షర్మిల కృతజ్ఞతలు చెప్పారు. జిల్లాలో పదిహేడు రోజుల పాటు రెండు వందల కిలోమీట్లర్ల పాదయాత్రను చేసినట్లు ఆమె చెప్పారు. ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, అమర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నాయకులు వై. విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత, ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఆమె వెంట పాల్గొన్నారు.

Back to Top