వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తూర్పు గోదావ‌రి : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) మృతి చెంద‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సంతాపం ప్రకటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి , సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  క‌రుణానిధి కుటుంబ సభ్యులకు   ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 
 
Back to Top