కర్నూలు జిల్లాలో మూడో రోజు సంఘీభావ పాదయాత్రలు

కర్నూలు జిల్లాః వైయస్‌ జగన్‌  ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె నుంచి గడివేముల వరుకు వైయస్‌ఆర్‌సీపీ నేత కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో మూడో రోజు పాదయాత్ర నిర్వహించారు. బలరాము రవి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదోనిలో వైయస్‌ఆర్‌సీపీ నేత మనోజ్‌ రెడ్డి ఆధ్వర్యంలో 500 బైక్‌లతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినేతలు ఫయాజ్‌ అహ్మద్,దేవా తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల బిజేంద్రా రెడ్డి ఆధ్వర్యంలో మూడో రోజు పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మిగనూరులో మండలం ఎ్రరకోట నుంచి గాజుల దిన్నె వరుకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు చెన్నకేశవరెడ్డి, జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. గోస్సాడు మండలంలో శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి ఆధ్వరంలో,  లక్ష్మిపురం నుంచి కల్లూరు వరుకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

తాజా ఫోటోలు

Back to Top