శివాజీ యుద్ధం చేయాల్సింది బాబుతోనే

విశాఖః కారెం శివాజీకి సంబంధించిన కేసుతో  వైయస్సార్సీపీకి ఏ సంబంధం లేదని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. ఎవరో వ్యక్తిగత కక్షతో కోర్టు కెళితే తీర్పు వచ్చిందని..దాన్ని వైయస్సార్సీపీకి అంటగట్టడం సరికాదన్నారు. మనసులో ఏవో దురుద్దేశాలు పెట్టుకొని వైయస్సార్సీపీని నిందించడం సరికాదని కారెం శివాజీకి హితవు పలికారు.  బాబుకు వ్యతిరేకంగా పుట్టిన మాలమహానాడు ఉద్యమాన్ని  కారెం శివాజీ తాకట్టుపెట్టారని నాగార్జున ధ్వజమెత్తారు. 

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి శివాజీ అనర్హుడని తెలిసి కూడా నియమించారని, అందుకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదని చెప్పారు. కారెం శివాజీ యుద్ధం చేయాల్సింది చంద్రబాబుతోనే అన్నారు. 

Back to Top