కారెం నోరు అదుపులో పెట్టుకో

పెనమలూరు (కృష్ణా)ః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహనరెడ్డిని విమర్శించే కనీస అర్హత కూడా లేని కారెంశివాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రదాన కార్యదర్శి వల్లే నరసింహారావు హెచ్చరించారు. ఆయన శనివారం వణుకూరులో విలేకరులతో మాట్లాడుతూ ....మాలల ఆత్మగౌరవాన్ని కాలరాసి పదవి కోసం చంద్రబాబుకు తొత్తుగా మారిన కారెం శివాజీ నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినా, జాతిని నట్టేట ముంచి, ఉద్యమాన్ని అమ్ముకుని పదవి పొందిన కారెంకు మాట్లాడే అర్హత లేదన్నారు. కారెంశివాజీ లాంటి నాయకుడి వలన అంబేడ్కర్‌ అత్మఘోషిస్తుందని , మాలలు ఆయనను బహిష్కరించాలని పిలుపు నిచ్చారు.

Back to Top