కాపులంతా వైయస్‌ జగన్‌ వెంటే


విశాఖ: తామంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని విశాఖ జిల్లా కాపులు పేర్కొన్నారు. ఏదో ఎక్కడో మాట్లాడారని వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని కాపులు నమ్మడం లేదని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ మాటని తప్పని నేత..మడమ తిప్పని నాయకుడని తెలిపారు. ఎన్ని సమస్యలు ఎదురైనా వైయస్‌ జగన్‌ వెంటే విశాఖ జిల్లా కాపులంతా ఉంటారని స్పష్టం చేశారు.  పవన్‌ కళ్యాణ్‌ వెంట కాపులు ఉన్నారనుకోవడం అపోహ మాత్రమే అన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామనడంపై కాపులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top