సత్తా ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌

రాబోయే రోజుల్లో వలసలు వేలల్లో ఉంటాయి: విశ్వరూప్‌
పోరాట పటిమ చూసి పార్టీలోకి: వెంకయ్యనాయుడు

తూర్పుగోదావరి జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రరాష్ట్రానికి దశా, దిశ చూపించే సత్తా ఉన్న నాయకుడని రాష్ట్ర ప్రజానీకం విశ్వసిస్తోంది. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్ర బాగుపడుతుందని, ఆయన వెంట నడిచేందుకు ఇతర పార్టీల నాయకులు వలసలు కడుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాపు నేత ఒంటెద్దు వెంకయ్యనాయుడు తన అనుచరులతో కలిసి వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

భారీ ఎత్తున చేరికలు

కోనసీమలోని ఆరు నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని వైయస్‌ఆర్‌ సీపీ నేత విశ్వరూప్‌ అన్నారు. వెంకయ్యనాయుడు చేరిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 800ల కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయన్నారు. అమలాపురంలో కొన్ని వేల మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా వస్తున్న రాజన్నబిడ్డకు అడుగడుగునా.. ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. 

కాపులు పెద్ద సంఖ్యలో చేరుతారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమ చూసి పార్టీలో చేరానని కాపు నేత వెంకయ్యనాయుడు అన్నారు. అలుపెరగని యోధుడిలా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. 
Back to Top