వైయస్‌ఆర్‌సీపీలోకి బీసీ నాయకుడు కాపారావు శివన్నాయుడు

విశాఖః వైయస్‌ జగన్‌ సమక్షంలో  విజయనగరం జిల్లాకు చెందిన నేతలు వైయస్‌ఆర్‌ సీపీలోకి చేరారు. బీసీ నాయకుడు కాపారావు శివన్నాయుడు, ఉపాధ్యాయురాలు నిర్మలాకుమారిలును వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శివన్నాయుడు మాట్లాడుతూ రాజన్న రాజ్యం తేవడానికి జగన్‌మోహన్‌ రెడ్డి అహర్నిశలు కృషిచేస్తున్నారని, వైయస్‌ఆర్‌సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని, వైయస్‌ జగన్‌ను అండగా ఉంటామన్నారు. నిర్మలా కుమారి మాట్లాడుతూ విలువలు, నిబద్ధత గల  నాయకుడు వైయస్‌ జగన్‌ అని, ఆయన సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నా ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు.
 
Back to Top