బాబు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు

హైదరాబాద్ః ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్ల వాపు వ్యాధితో గిరిజనులు మరణిస్తున్నా, పౌష్టికాహార లోపంతో శిశుమరణాలు సంభవిస్తున్నా..కాలేజీలు, ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. తమ  అధ్యక్షులు వైయస్ జగన్ ఇటీవల పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిధులు ఇవ్వనున్నారని పేర్కొన్నారు.

Back to Top