వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై వేధింపుల్ని సహించేది లేదు

కాకినాడ‌) వైయ‌స్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై తెలుగుదేశం ప్ర‌భుత్వం వేధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని తూర్పుగోదావ‌రి జిల్లా వైయస్సార్సీపీ అధ్య‌క్షులు కుర‌సాల క‌న్న‌బాబు మండిపడ్డారు. ఈ ధోర‌ణి మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. లేదంటే త‌గిన విధంగా మూల్యం చెల్లించుకోవాల‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తల్లి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్నబాబు సోమవారం మండపేట వచ్చారు. ఆ సందర్భంగా పట్టాభిరామయ్య చౌదరితోను,  పార్టీ కో ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణతో కన్నబాబు సమావేశమై నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రూ. 140 సబ్సిడీ సరుకులు తెచ్చుకునేందుకు పనులు మానుకుని కుటుంబ సభ్యులందరూ రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి వస్తుందన్నారు.  క్షేత్రస్థాయిలో పేదల సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు కాలక్షేప రాజకీయం చేస్తోందని విమర్శించారు.
Back to Top