పోలీసులపై కన్నబాబు ఆగ్రహం

కాకినాడ: కాకినాడలో పోలీసుల తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తి చేశారు. తమ పార్టీ నేతలను బెదిరిస్తూ.. అధికార పార్టీ సభ్యులకు మద్దతు ఇస్తున్నారంటూ కన్నబాబు ఆరోపించారు. దీంతో గుడారిగుంట 3వ డివిజన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడలో ప్రశాంతంగా ఓటింగ్‌ జరుగుతున్న క్రమంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 14 డివిజన్‌లో ఒక పక్క పోలింగ్‌ జరుగుతుండగా, మరోపక్క టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ ప్రలోభాలను వైయస్‌ఆర్‌ సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

Back to Top