సాగునీరు అందించలేని దుస్థితికి బాబు సర్కార్‌

కాకినాడ: గోదావరి డెల్టాకు సాగునీరు అందించలేని దుస్థితికి చంద్రబాబు సర్కార్‌ దిగజారిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించలేదని మండిపడ్డారు. జూన్‌ 1కే సాగునీటిని విడుదల చేస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు 20వ తేదీ వచ్చినా ఇప్పటి వరకు చుక్క నీటిని కూడా అందించలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సేపు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని విదేశీ సంస్థలకు అమ్ముకొని రియలెస్టేట్‌ వ్యాపారం చేయడమే తప్ప... రైతుల పంటకు సాగునీరు అందింద్దామనే జ్ఞానం లేకుండా పోయిందని ఆరోపించారు. అమరావతి పేరు చెబుతూ చంద్రబాబు రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నాడన్నారు. సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top