వైయస్సార్‌సీపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన కన్నబాబు

పీబీ దేవం(సామర్లకోట)సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు తోటకూర రాంబాబు (వైయస్సార్‌సీపీ) కుటుంబ సభ్యులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బుధవారం పరామర్శించారు. ఇటీవల కెనాల్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తోటకూర పద్మకుమార్‌ (31) మృతి చెందాడు. దాంతో కన్నబాబు పీబీ దేవం చేరుకొని ప్రమాదం జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకొని తన సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరం సొసైటీ అధ్యక్షుడు గరగ సుబ్రహ్మణ్యేశ్వరరావు, తోటకూర వెంకటేశ్వరరావు, తోటకూర సత్తిబాబు, మలకల వరహాలబాబు, మాజీ సొసైటీ అధ్యక్షుడు కర్నాశుల సీతారామరాజు, శారదా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్, తోటకూర శ్రీనివాస ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top