వైయ‌స్ జ‌గ‌న్‌తో కందుకూరు నేత‌ల భేటీ

ప్ర‌కాశం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నేత‌లు గురువారం భేటీ అయ్యారు. పార్టీ ఇన్‌చార్జ్  తూమాటి మాధవ రావు ఆధ్వర్యంలో అధినేత‌ను క‌లిసిన నేత‌లు సోమశిల ఉత్తర కాలువ ను రాళ్లపాడు రిజర్వాయర్ కి అనుసంధానం చేసే విష‌యంలో జరుగుతున్న జాప్యాన్నివివరించారు. త్వ‌ర‌లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విష‌యంపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు మాధ‌వ‌రావు తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో..   గుడ్లురు జట్పిటిసీ  వెంకటరామి రెడ్డి  , గుడ్లురు ప్రచార కమిటి అధ్యక్షులు మధు , గుడ్లురు రైతు విభాగ అధ్యక్షులు నరాల శ్రీనివాసులు   గుడ్లురు యూత్ కమిటీ అధ్యక్షులు కిశోర్ ,  త‌దిత‌రులు ఉన్నారు

Back to Top