చేతగాని దద్దమ్మ మంత్రి

()పోలవరం, రాజధానిలో వాటాలే తప్ప ప్రజాసమస్యలు పట్టవా బాబు
()రాష్ట్ర ప్రజల జ్వరాలతో అల్లాడుతుంటే ఏం చేస్తున్నారు
()డబ్బులు దండుకోవడానికే మంత్రిగా ఉన్నావా కామినేని
()ప్రజారోగ్యం గురించి ఏం చర్యలు తీసుకున్నారు
()ఆరోగ్యశ్రీ,108లతో ప్రజల డాక్టర్ గా వైయస్సార్ కీర్తించబడ్డారు
()వైయస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున

హైదరాబాద్ః రాష్ట్రమంతా విషజ్వరాలతో బాధపడుతుంటే చంద్రబాబుకు, ఆరోగ్యమంత్రికి ఏమాత్రం పట్టడం లేదని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎంతసేపు చంద్రబాబుకు రాజధానిలో , పోలవరంలో ఎంతవాటా తీసుకోవాలి, కేసుల్లోంచి ఎలా బయటపడాలి అన్న ధ్యాసే తప్ప..రైతులు, ప్రత్యేకహోదా, వ్యవసాయం, ప్రజారోగ్యం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేకపోవడం బాధాకరమన్నారు.  ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ పేరుకే డాక్టర్ తప్ప....వృత్తిపై కనీస అవగాహన కూడా లేని చేతగాని దద్దమ్మ అని నిప్పులు చెరిగారు.

డాక్టర్ అంటే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డియేనని చెప్పారు. సామాన్యుల నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతీ ఒక్కరినీ చెక్ చేసి మెడిసిన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, 108,104 లాంటి పథకాలతో ప్రజలకు ఉపయోగపడే డాక్టర్ గా వైయస్సార్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఎంబీబీఎస్ కూడా పూర్తిచేయకుండా డాక్టర్ గా చెలామణి అవుతున్న కామినేని శ్రీనివాస్...ఆరోగ్యమంత్రిగా పేదలకు ఏమి చేస్తున్నాడని ప్రశ్నించారు. బీజేపీనుంచి గెలిచి బాబు వద్ద తెలుగుదేశం కార్యకర్తలా గంగిరెద్దులాగా పనిచేస్తున్నారు తప్ప...ఆరోగ్యపరంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచన చేయడం లేదని ధ్వజమెత్తారు. 

గుంటూరులో ఎలుకలు కొరికి పిల్లాడు చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారని, ఓ పిల్లవాడు బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇస్తే  ఏం చేశారని కామినేనిని నిలదీశారు. మోకాళ్ల చిప్ప ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినట్లు నటించి వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడని ఎద్దేవా చేశారు.ఇదేనా నీ పనితనం అని కామినేనిని కడిగిపారేశారు. నందిగామలో సొంత టీడీపీ ఎమ్మెల్యే  అనారోగ్యంతో పడి ఉంది. ఎమ్మెల్యేకే దిక్కులేదు. అనంతపురంలో ఎంతోమంది పేదల విషజ్వరాలతో చనిపోయారు. ఏం చేస్తున్నారని ఆరోగ్యమంత్రిని ప్రశ్నించారు. కామినేనికి డిపార్ట్ మెంట్ మీద అవగాహన లేదు. పనిచేయాలన్న తపన లేదు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని పేదలకు అందకుండా చేసే దుర్భర పరిస్థితులు తీసుకొచ్చిన చేతగాని దద్దమ్మ మంత్రి అని విరుచుకుపడ్డారు. 

ప్రజారోగ్యానికి సంబంధించి పీహెచ్ సీలను ప్రైవేటుపరం చేస్తారా..? వైయస్సార్ ఉన్నప్పుడు హాస్పిటల్ హెల్త్ మెనేజ్ మెంట్ ఉండేది. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస వసతులు తెలుసుకొని ప్రజాప్రతినిధులను మెంబర్ గా చేశారు.  దాన్నికూడా తీసేశారు. ఆరోగ్యమంత్రిగా ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించారా..?మంత్రులుగా ఉండి డబ్బులు దండుకోవడానికి చంద్రబాబుకు స్లావరీ ఉద్యోగం చేస్తున్నారే తప్ప...పేదల బాగోగులే పట్టడం లేదని ఆగ్రహించారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే పట్టించుకోరు. ప్రజల సమస్యలు పట్టవు.  రాష్ట్రంలోని వనురులను కాజేస్తున్నారు. మట్టి నుంచి ఇసుకదాకా అమ్ముకొని కోటానుకోట్లు సంపాదించారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు ప్రజలను మోసం చేస్తున్నారని మేరుగు ఫైర్ అయ్యారు.  

తక్షణమే విషజ్వరాలకు సంబంధించి  ఎంక్వైరీ వేసి రోగాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చేతగాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కళ్లులేని కబోదుల్లా ఎందుకున్నారని నిలదీశారు. రాష్ట్రంలో కరువు దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటే.... హెలికాప్టర్ లో ఏరియాల్ సర్వే చేసి కరువెక్కడ అని ముఖ్యమంత్రి మాట్లాడడం హేయనీయమని నాగార్జున విమర్శించారు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ లపై 4 శాతం అదనంగా వ్యాట్ వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఎల్టీఎస్ లా రాష్ట్రంలో  లోకేష్ ట్యాక్స్ ఎక్స్ ట్రా నడుస్తోందని దుయ్యబట్టారు. 

Back to Top