వైయస్‌ జగన్‌తోనే పేదల జీవితాల్లో వెలుగు

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే పేదల జీవితాలు బాగుపడతాయని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పెండ్లిమ్రరి మండలం నందిమండలం గ్రామంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌– కావాలి జగన్‌ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల గురించి వివరించారు. అదే విధంగా నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం కల్పించాలని కోరారు. అభివృద్ధి అంటే ఏంటో వైయస్‌ జగన్‌ చేసి చూపిస్తారని చెప్పారు. మోసం, దగా, వెన్నుపోటుకు కేరాఫ్‌గా మిగిలిన చంద్రబాబు పార్టీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు దుగ్గాయపల్లి మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top