కొడాలి నాని ది అక్రమ అరెస్టు


విజయవాడ : గుడివాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నానిని అరెస్ట్పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆదివారం పామర్రులో స్పందించారు. కొడాలి నానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడానికి ఓ పద్దతి ఉంటుందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా... బలవంతంగా పార్టీ కార్యాలయాన్ని ఎలా ఖాళీ చేయిస్తారని ఆమె ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే కొడాలి నానిని విడుదల చేయాలని ఉప్పలేటి కల్పన పోలీసులను డిమాండ్ చేశారు.


Back to Top